కోదాడ వద్ద ప్రైవేటు బస్సు బీభత్సం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున భీకర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ బైపాస్ వద్ద వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందర ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .



