మొక్కజొన్న రైతుల కష్టాలు.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం
తెలంగాణలో మొక్కజొన్న రైతుల కష్టాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తూ ఉండడంతో దళారులకే తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం బస్తాకి రూ.2,400 మద్దతు ధర ఇస్తోంది. కానీ ఎక్కడా కొనుగోళ్లు లేవు. దీంతో రైతులు దళారులకి 1600 నుంచి 1900కే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్నలు నిల్వ చేసి ప్రభుత్వం కొన్నప్పుడే అమ్ముదామని అనుకుంటే అకాల వర్షాల వల్ల మొక్కజొన్నలు మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.



