జనవరి 3ను ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించాలి

TG: సావిత్రిబాయి ఫూలే జయంతి అయిన జనవరి 3ను ప్రజా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ K.నాగేశ్వర్ అన్నారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నప్పటికీ, మహిళలు, దళిత-బహుజనులకు విద్య అందించేందుకు సావిత్రిబాయి చేసిన కృషికి తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. 1848లో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించిన ఆమె, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూనే విద్యాహక్కు కోసం పోరాడారని తెలిపారు.



