← Back to news

15 సెకన్లలో నలుగురిని కరిచిన పిచ్చి కుక్క

By sahani· 6 Apr 2026· Telugu Report· Madhya pradesh

మధ్యప్రదేశ్‌లోని కేవ్తీ గ్రామంలో ఒక పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై కేవలం 15 సెకన్లలో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచింది. ఇంటి ఆవరణలో కూర్చున్న వారిపైకి ఒక్కసారిగా ఎగపడి కరిచింది, కుర్చీలతో కొట్టినా వెనక్కి తగ్గకుండా విరుచుకుపడింది. ఈ భయంకరమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వీధి కుక్కల దాడుల పట్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

More in Health