← Back to news

నిద్రలో మన శరీరం ఏం చేస్తుందో తెలుసా? 😴

By Nani Garikina· 20h ago
నిద్రలో మన శరీరం ఏం చేస్తుందో తెలుసా? 😴

మనకు నిద్ర అంటే రోజంతా చేసిన పనికి ఒక బ్రేక్‌లా అనిపిస్తుంది.. కానీ మనం నిద్రలోకి జారుకున్న వెంటనే శరీరం మాత్రం మరో షిఫ్ట్‌ మొదలుపెడుతుంది. మెదడు రోజంతా వచ్చిన సమాచారాన్ని ప్రాసెస్‌ చేస్తూ జ్ఞాపకాలను బలపరుస్తుంది. శరీరం కణజాలాల రిపేర్‌, హార్మోన్ల సమతుల్యత వంటి కీలక పనులను కొనసాగిస్తుంది. ఇదే సమయంలో గుండె వేగం, శ్వాస నెమ్మదిస్తాయి. అంటే నిద్రలో శరీరం లోపల రిపేర్‌, రీసెట్‌ పనులు జరుగుతూ ఉంటాయి. అందుకే మంచి నిద్ర మన మెదడు, శరీరాన్ని మరుసటి రోజుకు ఫ్రెష్‌గా సిద్ధం చేస్తుంది.

More in Education