తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీకి వారిద్దరే కారణం

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకానికి వైసీపీ కీలక నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలే కారకులని రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ కమిషన్ తేల్చి చెప్పింది. టీటీడీలో నెయ్యి సరఫరాలో పకడ్బందీగా ఉన్న టెండర్ నిబంధనల్ని మార్చడానికి వీరిద్దరే సిఫార్సు చేశారని నివేదిక ఇచ్చింది. కొనుగోలు కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో చెవిరెడ్డి, భూమనలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చెప్పింది.



