ఆదివాసీ యువతకు ప్రత్యేక ఉద్యోగ చట్టం కావాలి

AP: ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లో న్యాయం జరిగేలా ప్రత్యేక షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామక చట్టాన్ని వెంటనే తీసుకురావాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పోలవరం జిల్లా చింతూరు కేంద్రంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్డ్ ఏరియాల్లో స్థానిక ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించాలని కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు.



