అమలాపురంలో ప్రతిష్టాత్మక న్యాయ సదస్సు

AP: ఆస్తి చట్టాలు, సవరించిన నిశ్చయాత్మక ఉపశమన చట్టంపై విస్తృత చర్చకు అమలాపురంలో ఈ నెల 30న జిల్లా న్యాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐఏఎల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఎండీ. అజామ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీ సి. పద్మనాభ రెడ్డి సెమినార్ హాల్‌లో సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి.శివశంకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై కానున్నారు.

