హైటెక్ సిటీలో 15ఏకరాల భూమికి కంచె

TG: హైటెక్ సిటీలోని ఖానామెట్ గ్రామంలో అరబిందో టవర్స్ పక్కనున్న 15ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కంచె ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లోని సర్వే నంబర్లు 41/12, 13, 14లో పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమి సంరక్షణకు చర్యలు చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. స్థలాన్ని ఖాళీ చేయాలంటూ 2016లో TGIIC ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ భూమి తమదేనంటూ ఇట్టినా ప్రాపర్టీస్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషనర్ సమర్పించిన పట్టా పత్రాలు నకిలీవి అని తేలింది.



