అరెస్ట్‌తో సరిపెట్టొద్దు.. సియా డిమాండ్ ఇదే

గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడు కళ్యాణ్ బైంస్లాను పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. తనను చంపేందుకు యత్నించిన వ్యక్తిని కేవలం అరెస్ట్ చేస్తే సరిపోదనీ, కఠినమైన శిక్ష విధించాలని సియా కోరారు. అతను బెయిల్‌పై బయటకొస్తే న్యాయం జరిగినట్లు అవ్వదనీ, కారులోని మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఆమె సింపతీ పొందేందుకు వాడుకుంటున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు. పోలీసులు హత్యాయత్నం సహా కొన్ని సెక్షన్ల కింద కేసు పెట్టారు.



