పోస్టాఫీసులో ఫండ్స్ గోల్‌మాల్.. మహిళ అరెస్ట్

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ పోస్టాఫీసులో 39.25 లక్షల రూపాయల ప్రభుత్వ ఫండ్స్ గోల్‌మాల్ కేసు వెలుగులోకి వచ్చింది. పోస్టల్ శాఖకు చెందిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 7న జరిగిన ఫైనాన్షియల్ వెరిఫికేషన్‌లో లెక్కల్లో తేడాలు బయటపడ్డాయి. 2023 జనవరి నుంచి 2024 మే వరకు PLI, RPLI ప్రీమియం ఫండ్స్ అఫీషియల్ అకౌంట్లలో జమ కాలేదని అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 14న అరెస్టయిన నిందితురాలు పోలీస్ కస్టడీలో ఉంది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.



