గ్యార్మీ మహోత్సవానికి మంత్రి లోకేష్‌కు ఆహ్వానం

మంగళగిరి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేశ్ నివాసంలో రత్నాల చెరువు గౌస్ పాక్ హజరత్ మహబూబ్ సుభాని గ్యార్మీ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 9న జండా చెట్టు వద్ద నిర్వహించనున్న 35వ గ్యార్మీ మహోత్సవానికి హాజరు కావాలని కోరుతూ కమిటీ కన్వీనర్ షేక్ సుభాని ఆధ్వర్యంలో మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


