చదువుతో పాటు ఉద్యోగంపై అవగాహన

విద్యార్థి దశలోనే ఉద్యోగాలపై అవగాహన కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాఠశాల స్థాయి నుంచే కెరీర్ కౌన్సెలింగ్, ఇంటర్ స్థాయిలో స్కిల్స్ పై శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. డిజిటల్ అకాడమీ ద్వారా కొత్త టెక్నాలజీలపై శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరినట్లు సమాచారం. చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
