SIRను రద్దు చేయాలని నిరసన

SIR విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఏలూరు జిల్లా కుక్కునూరులో ఆందోళన చేపట్టాయి. కుక్కునూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించిన నాయకులు.. ఓట్ల తొలగింపునకు అవకాశం కల్పించేలా ఉన్న SIR ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. SIR ద్వారా BJPకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, Chief Election Commissioner జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

