ఆత్మకూరులో అంగన్వాడీ సేవా ఉత్సవం
మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో అంగన్వాడీ సేవా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లను సన్మానించారు. చిన్నారుల సంరక్షణ, పౌష్టికాహారం, ప్రాథమిక విద్య అందించడంలో వారు చేస్తున్న సేవలను పలువురు అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని అంగన్వాడీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.


