సమ్మర్ లో స్కిన్ కేర్ కోసం ఈ ఫుడ్ తినండి!

సమ్మర్ లో సూర్యరశ్మి ప్రభావంతో స్కిన్ టాన్ అవ్వడం కమిలిపోవడం సాధారణ సమస్యగా మారింది. UV కిరణాల వల్ల కలిగే స్కిన్ ప్రాబ్లమ్స్ మనం తినే ఆహారంతో అరికట్టవచ్చు. దానిమ్మ, జామ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఎండదెబ్బ నుండి రక్షించి, మృదువుగా ఉంచుతాయి. బంగాళాదుంపలు కూడా వాపును తగ్గించి ఇన్స్టంట్ గ్లో ఇస్తాయి. అయితే, ఆహారంతో పాటు బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడటం, జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.



