విజయ్‌ను పొగిడిన నాని..వీడియో వైరల్
తమిళనాడు సీఎం, యాక్టర్ విజయ్‌పై టాలీవుడ్ హీరో నాని ప్రశంసలు కురిపించాడు. నిన్న తమిళనాడులో జరిగిన ప్యారడైస్ మూవీ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ విజయ్‌కు తమిళ ప్రజల్లో చాలా అభిమానం ఉందని, ప్రజలు విజయ్‌ను తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తున్నారని చెప్పారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం ఆసక్తికరంగా ఉందన్నారు. అసెంబ్లీలో విజయ్ బాగా మాట్లాడుతున్నారని నాని అన్నారు. విజయ్ రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని నాని కోరుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.
