సైబరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. WFHకు సూచన!

TG: సైబరాబాద్‌లో వర్షాలు, గణేశ్ నిమజ్జన ఊరేగింపుల కారణంగా ట్రాఫిక్ పోలీసులు కీలక <a href="https://x.com/CYBTRAFFIC/status/2100574071234929087">అడ్వైజరీ</a> జారీ చేశారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి 25 వరకు కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత దశలవారీగా ఎర్లీ లాగ్‌అవుట్ ఇవ్వాలని, వీలైన చోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించాలని సూచించారు. స్కూళ్లు, విద్యాసంస్థలు ఆన్‌లైన్ లేదా వర్చువల్ క్లాసులు నిర్వహించాలని కోరారు.



