యూత్ కి షాకింగ్ న్యూస్

30 ఏళ్ల లోపు యువతీ యువకులకీ డయాబెటిస్ సోకుతోంది. ప్రతీ అయిదుగురిలో ఒకరు ప్రీడయాబెటిక్ కండిషన్ లో ఉన్నారని అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 నివేదిక వెల్లడించింది. 30 ఏళ్లు లోపు వారిలో ఆరోగ్య సమస్యలపై ఈ నివేదికలో చర్చించారు. ఇంకా ఈ నివేదిక ఏం చెప్పిందంటే 66% మంది బలహీనం 69% మందిలో విటమిన్ డీ లోపం 46% మందిలో ప్రీ హైపర్ టెన్షన్ 59% మందిలో ఊబకాయం కార్పొరేట్ ఉద్యోగుల్లో 80% మంది అధిక బరువు 52% మందిలో అసాధారణంగా కొలస్ట్రాల్ శారీరక శ్రమ లేకపోవడం వల్లే యువత నిర్వీర్యం అయిపోతోందని నివేదిక హెచ్చరించింది.



