ప్రైవేట్ బడుల ఫీజుల నియంత్రణపై కరీంనగర్‌లో రౌండ్ టేబుల్
TG: TPF విద్యా బస్సుయాత్రలో భాగంగా రేపు (సెప్టెంబర్ 18న) కరీంనగర్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఫిల్మ్ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రైవేట్ బడుల ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్య బలోపేతంపై చర్చించనున్నారు. విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో 18 శాతం కేటాయించాలని TPF డిమాండ్ చేస్తోంది. విద్యావేత్తలు, యాక్టివిస్టులు, NGOs, పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్లు సమావేశానికి హాజరుకావాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు.



