రేవంత్‌రెడ్డికి మన్నె క్రిశాంక్ సవాల్
TG: BRS నేత మన్నె క్రిశాంక్ CM రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే మరోసారి ప్రెస్‌మీట్ పెట్టనని, రేవంత్‌రెడ్డి కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెబుతానన్నారు. మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్‌స్ట్రక్షన్స్, శోదా కన్‌స్ట్రక్షన్స్, స్వచ్ బయోపై 50 వేల కోట్ల రూపాయల అక్రమాల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు ఆధారాలను ED, ప్రధాని కార్యాలయానికి పంపిస్తానన్నారు. దీనిపై విచారణకు CM సిద్ధమా అని ప్రశ్నించారు.

