← Back to news

అందరూ భాగస్వాములైతేనే రైజింగ్ తెలంగాణ

By DK· 2 Aug 2026· హైదరాబాద్
అందరూ భాగస్వాములైతేనే రైజింగ్ తెలంగాణ

తెలంగాణ రైజింగ్-2047 కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన '50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్' సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

More in TG