అర్ధరాత్రి ఘోర ప్రమాదం

AP: నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలవరం జిల్లా చింతూరు మండలం సరివెల గ్రామంలోని జాతీయ రహదారిపై ఉన్న పశువులను శనివారం అర్ధరాత్రి DCM వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఘటనలో ఏడు పశువులు స్పాట్‌లోనే మృతి చెందాయి. మృతి చెందిన ఏడు పశువులు సరివెల గ్రామానికి చెందిన ముర్రం లక్ష్మయ్యకు చెందినవిగా గుర్తించారు. ఏడు ఆవులు మృతి చెందడంతో తాము జీవన ఉపాధి కోల్పోయామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మృతి చెందిన పశువులు విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.



