హత్య చేసి డెడ్‌బాడీని గోనె సంచిలో కట్టి..

AP: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామపరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య తీవ్ర కలకలం రేపింది. మృతుడు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భూవివాదానికి సంబంధించి రవికుమార్ శతకోడు గ్రామంలోని పొలానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం డెడ్‌బాడీని గోనె సంచిలో పెట్టి బండరాళ్లతో కట్టి నీటిలో పడేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భూవివాదమే హత్యకు కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.



