← Back to news

బిర్యానీ కోసం గొడవ పడి దంపతుల ఆత్మహత్య!

By DS· 9 Jun 2026· visakhapatnam
బిర్యానీ  కోసం గొడవ పడి దంపతుల ఆత్మహత్య!

బిర్యానీ విషయంలో ఫోన్‌లో జరిగిన వాగ్వాదం చివరకు దంపతుల ప్రాణాలు బలితీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం(33), ప్రియాంక(27) విశాఖ శ్రీనగర్‌లో నివసిస్తున్నారు. ఆదివారం మద్యం తాగడానికి బయటకు వెళ్లిన భర్త బలరాం, భార్యకు ఫోన్ చేసి బిర్యానీ తెచ్చి ఉంచాలని కోరాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రియాంక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన బలరాం ఆమె డెడ్ బాడీని చూసి భయంతో తన నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ*త్య చేసుకున్నాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.