హైదరాబాద్‌లో దారుణం.. లవర్ తో కలిసి భర్తను చంపిన భార్య!

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీ బయటపడింది. సత్యవతి అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్త పెంతేష్ (45)ను మర్డర్ చేసింది. ఆ తర్వాత ఎవరికీ డౌట్ రాకుండా బాడీని తీసుకెళ్లి మహారాష్ట్ర బోర్డర్ దగ్గర పాతిపెట్టేసింది. లాస్ట్ నవంబర్‌లో తన భర్త కనిపించడం లేదంటూ తనే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కానీ, పోలీసులు కేసు ఫైల్ చేసి ఆమె కాల్ రికార్డ్స్, CCTV ఫుటేజ్ చెక్ చేయడంతో ఈ కిల్లర్ ప్లాన్ మొత్తం బయటపడింది.



