← Back to news

పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్

By DK· 9 Jun 2026· Eenadu· మహబూబ్‌నగర్ జిల్లా
పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్

TG: పాలమూరు యూనివర్సిటీలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం వెల్జర్ల విలేజ్‌కు చెందిన కార్తీక్ (23) పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలు సోమవారం ప్రారంభం కాగా.. రాత్రి 9.30 గంటలకు హాస్టల్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన ఫ్రెండ్స్ కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.