బస్సులో మంటలు.. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే దగ్ధం

AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీకి చెందిన ఉద్యోగులు విధులు ముగించుకుని సూళ్లూరుపేట వెళ్తుండగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. IMOP కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు తిరుపతి జిల్లా తడ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అలెర్ట్ అయిన ఉద్యోగులు, డ్రైవర్ బస్సులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడమే కారణమని అంచనా వేశారు.



