భూ అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి : ఏలేటి

TG: ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు తెలపాలని BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ధరణి ద్వారా పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపిస్తూ, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఏం తేలిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు. నిషేధిత జాబితాలో భూముల సంఖ్య ఎందుకు పెరుగుతోందో చెప్పాలని ప్రశ్నించారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపించారు.



