ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాలు విలీనం

TG: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను కలపాలంటూ పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు. ప్రజలు రిక్వెస్ట్ చేస్తూ తీసుకొచ్చిన పత్రాలపై సంతకం చేసి 37 గ్రామాలను ఫ్యూచర్‌సిటీలో కలపాలని అధికారులను ఆదేశించారు. మహేశ్వరం మండలంలో 28 గ్రామాలు, కందుకూరులోని 9 గ్రామాలు కలిపి 37 గ్రామాలు ఫ్యూచర్‌సిటీలో భాగం కానున్నాయి.



