డ్రగ్స్ వద్దు బ్రో: సీఎం చంద్రబాబు

AP: అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ ద్వారా తన సందేశం ఇచ్చారు. డ్రగ్స్‌పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడటమే అన్నారు. ఏపీలో డ్రగ్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ బారినపడ్డ వారికి సహాయం అందించి..పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.



