ప్రియదర్శిని టీ ఎస్టేట్..స్పెషల్ అట్రాక్షన్

కేరళ లోని వయనాడ్‌లో ప్రియదర్శిని టీ ఎస్టేట్ టీ ఉత్పత్తితో పాటు విజిటర్స్ ను ఆకర్షిస్తుంది. దాదాపు 1,000 ఎకరాల్లో ఉన్న ఈ ఎస్టేట్‌లో కొంత భూమిని టీ సాగుకు ఉపయోగిస్తున్నారు. మిగిలిన ప్రాంతం ప్రకృతిసిద్ధంగా ఉంటుంది. ఎస్టేట్ ద్వారా సుమారు 300 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. పిల్లలకు చదువు, కుటుంబాలకు ఇళ్లు, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. వయనాడ్‌కు వచ్చే పర్యాటకులు ప్రియదర్శిని టీ ఎస్టేట్ స్పెషల్ అట్రాక్షన్.

