← Back to news

CNG ఫిల్లింగ్‌ టైంలో పేలుడు..ముక్కలైన కారు

By Sharmila· 2h ago· Indiatimes

గుజరాత్‌లోని వడోదర జిల్లా కర్జణ్ దగ్గరలోని NH-48పై కార్ లో CNG నింపుతుండగా గ్యాస్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో కారు వెనుక భాగం తీవ్రంగా ధ్వంసమై, లోహం, అద్దాల ముక్కలు పలుమీటర్ల దూరం ఎగిరాయి. దగ్గరలోని మరో రెండు వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యాయి. పేలుడు సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టి, కారణాలపై ఎంక్వయిరీ చేస్తున్నారు.

More in National