← Back to news

హత్య చేసి ఆపై అంత్యక్రియల్లో పాల్గొని

By DeeK· 24 Jun 2026· Eenadu· మెదక్ జిల్లా
హత్య చేసి ఆపై అంత్యక్రియల్లో పాల్గొని

TG: మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన వృద్ధురాలు దోమకొండ సాయవ్వ ఈనెల 17న అనారోగ్యంతో మృతి చెందిందని అంత్యక్రియలు చేశారు. ఆమె మెడపై గాయం కనిపించడం, బంగారం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయవ్వ రెండో కుమార్తె లక్ష్మి పెద్ద కుమారుడు విశాల్‌పై అనుమానం రాగా, అతడిని విచారించారు. అతడు హత్య చేసినట్లు అంగీకరించాడు. విశాల్, తన ఫ్రెండ్ ప్రశాంత్‌తో కలిసి సాయవ్వకు గొంతు నులిపి హత్య చేశారు. బంగారు ఉంగరం, చెవికమ్మలు, రూ.7,000 తీసుకొని హైదరాబాద్ పారిపోయారు. తర్వాత అమ్మమ్మ అంత్యక్రియల్లోనూ పాల్గొన్నట్లు CI సైదా తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 22h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.