తెలంగాణ ఇక్కత్ చీరకు జాతీయస్థాయి గుర్తింపు

TG: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన చేనేత కళాకారుడు గంజి వెంకటేశ్‌కు ప్రతిష్టాత్మక జాతీయ చేనేత పురస్కారం వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘సంత్ కబీర్ హస్తకళా’ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక కళాకారుడిగా వెంకటేశ్ నిలిచారు. సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి సుమారు 15 నెలలపాటు శ్రమించి రూపొందించిన ఇక్కత్ పట్టుచీర జాతీయ పోటీలో విజేతగా నిలిచింది.



