← Back to news

లీవ్ తీసుకున్నందుకు మహిళా టెకీకి కంపెనీ షాక్

By DK· 23 Jul 2026· మేడ్చల్ జిల్లా

TG: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలో ఓ మహిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తన కుమార్తె అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నందుకు ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. భావన అనే బాధితురాలు ముందస్తుగా సమాచారం ఇచ్చి, హెల్త్ రిపోర్టులు సమర్పించి మూడు రోజుల లీవ్ తీసుకున్నప్పటికీ ఎలాంటి నోటీసు లేకుండా జాబ్ నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైనింగ్ సమయంలో అనారోగ్యంతో 13 రోజుల సిక్ లీవ్ తీసుకున్నప్పుడు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయని తెలిపారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More in TG