← Back to news

బ్యాంక్ మేనేజర్‌ను కొట్టిన మాజీ సీఎం కరుణానిధి మనవరాలు

By RK· 27 Jul 2026

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనవరాలు కయల్విళి, చెన్నై అడయార్‌లోని ఎస్‌బిఐ బ్యాంక్ మేనేజర్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జూలై 20న ఈ ఘటన జరిగింది. ఆ బ్యాంకు ఉన్న బిల్డింగ్ కయల్విళిదే. అయితే అందులో లిఫ్ట్ పనిచేయకపోవడంతో ఆమె మేనేజర్ దగ్గరకు వెళ్లి తీవ్రంగా గొడవ పెట్టుకుంది. ఆయన స్టైల్‌ను ఎక్కిరిస్తూ కోపంతో చెంప మీద కొట్టింది. మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కయల్విళిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

More in News