జైలు నుంచి పోక్సో నిందితుడు ఎస్కేప్

TG: వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్‌కుమార్ రెడ్డి సమీప బంధువైన బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమ కూతురు మైనర్ అని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిశోర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. జూన్ 12న అతన్ని మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. అయితే కిశోర్ ఈ నెల 6న జైలు గోడ దూకి పారిపోయాడు. ఖైదీ పారిపోవడానికి జైలు సూపరింటెండెంట్ శశికాంత్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా గుర్తించారు. శశికాంత్‌ను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి బదిలీ చేశారు. ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేసి మరికొందరికి ఛార్జ్ మెమోలు ఇచ్చారు.



