ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ.. పోలీసులు కాల్పులు

AP: బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో S-3, S-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. దొంగలు రైలు దిగి పారిపోతుండగా ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.



