నీట్ నిరసనలతో హీటెక్కిన హైదరాబాద్

TG: నీట్ పేపర్ లీకేజీ నిరసనలు హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్, BJP నేతలు పరస్పరం ఒకరి రాష్ట్ర కార్యాలయాలను మరొకరు ముట్టడించేందుకు ప్రయత్నించడంతో నాంపల్లి ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. గాంధీభవన్ ముట్టడికి వెళ్లిన BJP నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కాంగ్రెస్ నేతలు BJP ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, కర్రలు, రాళ్లతో దాడులు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి పలువురు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు.



