← Back to news

మహిళల ఆర్థిక స్వేచ్ఛే ప్రభుత్వ లక్ష్యం: సీతక్క

By DK· 2h ago
మహిళల ఆర్థిక స్వేచ్ఛే ప్రభుత్వ లక్ష్యం: సీతక్క

TG: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కోటీశ్వరులుగా ఎదగడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన ఇందిర మహిళాశక్తి సదస్సులో మంత్రి పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళల ఆర్థిక స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మహిళలు తమకు నచ్చిన వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలని సూచించారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గత రెండున్నరేళ్లలో సుమారు రూ.300 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు.

More in TG