బంజారాహిల్స్‌కు సమానంగా ఆదివాసీ బడులు: ఆకునూరి మురళి

TG: పిల్లలందరికీ దగ్గర్లోనే మంచి ప్రభుత్వ స్కూల్ అందుబాటులో ఉండాలని రిటైర్డ్ IAS అధికారి ఆకునూరి మురళి అన్నారు. TPF <a href="https://www.theclearcutnews.com/n/tNXHyWg">విద్యాబస్సు యాత్ర</a>లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్‌లో ఆయన మాట్లాడుతూ ఆశ్రమ, రెసిడెన్షియల్, గురుకుల స్కూళ్లు అందరికీ శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను దూరంగా ఉన్న గురుకులాలకు పంపేందుకు ఆలోచించే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్కూళ్లలో సౌకర్యాలు ఎలా ఉంటాయో, ఆదివాసీ గ్రామాల బడుల్లోనూ అలాంటి వసతులు ఉండాలని డిమాండ్ చేశారు.



