వోల్వోలో ఒక్కసారిగా మంటలు.. ప్రముఖ డాక్టర్ మృతి
TG: సూర్యాపేట-ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఓ వోల్వో కారు డివైడర్‌ను ఢీకొని ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఖమ్మం మమతా హాస్పిటల్‌లో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న కసకుర్తి జగదీశ్ మృతి చెందారు. యాక్సిడెంట్ టైమ్‌లో కారులో ఆయన ఒక్కరే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు మంటల్లో <a href="https://x.com/GUMMALLALAKSHM3/status/2101577229113200790">పూర్తిగా కాలిపోవడంతో</a> జగదీశ్ లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.


