అమెరికాలో పల్నాడు యువకుడు మృతి

AP: పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవితేజ (34) ఉన్నత చదువుల కోసం 2019లో అమెరికా వెళ్లి, అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. ఒహియో రాష్ట్రం కీవ్‌లాండ్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేసి, గృహప్రవేశానికి తల్లిదండ్రులను కూడా అమెరికాకు ఆహ్వానించాడు. రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. సంతోషంగా ఉన్న సమయంలో రవితేజకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.



