← Back to news

ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య

By DK· 11 Jun 2026· Hmtvlive· కామారెడ్డి జిల్లా
ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య

TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం మర్కల్‌ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య (45), రేణుక దంపతులు. రేణుకకు గంగాశేఖర్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. అడ్డుగా ఉన్న రాజయ్యను తొలగించుకోవాలని, అంతేకాకుండా రాజయ్య చనిపోతే ఆయన పేరు మీదున్న ఇన్సూరెన్స్ సొమ్ము తమకే దక్కుతుందని ప్లాన్ వేశారు. రేణుక, గంగాశేఖర్ పథకం ప్రకారం రాజయ్యకు మద్యం తాగించి ఐరన్ రాడ్‌తో కొట్టి హత్యచేశారు. అనుమానం రాకుండా రోడ్ యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. నేరం అంగీకరించడంతో నిందితులు రేణుక, గంగాశేఖర్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.