← Back to news

కోడూరు బీచ్‌లో ముగ్గురు చిన్నారుల గల్లంతు

By DK· 28 Jun 2026· నెల్లూరు జిల్లా
కోడూరు బీచ్‌లో ముగ్గురు చిన్నారుల గల్లంతు

AP: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బీచ్‌లో స్నానం చేస్తుండగా ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బాలుడు మహమ్మద్ సుఫియాన్ మృతి చెందాడు. ఓ బాలికను జాలర్లు కాపాడగా, మరో బాలిక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఆ బాలిక కోసం గాలిస్తున్నారు. సముద్ర స్నానానికి వచ్చి ప్రమాదంలో చిక్కుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.