← Back to news

నేషనల్ హైవేపై మూడు కార్లు బోల్తా.. ఫుల్ ట్రాఫిక్‌జామ్

By DK· 28 Jun 2026· నల్గొండ జిల్లా

TG: హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద కారు టైర్ పేలి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టిన కారు అంతటితో ఆగకుండా అవతలి రోడ్డుపై ఎగిరిపడి మరో రెండు కార్లపై పడింది. వరుసగా మూడు కార్లు బోల్తా పడడంతో హైవేపై ఫుల్ ట్రాఫిక్‌జామ్ అయింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చౌటుప్పల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.