డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

AP: కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల లేడీస్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయి 27మంది దంత వైద్య విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో దోశ తిన్న వారు తీవ్ర అస్వస్థకు గురవడంతో చికిత్స కోసం కడప రిమ్స్ హాస్పిటల్‌కు తరలించినట్లు డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ యుగంధర్ తెలిపారు. ప్రస్తుతం స్టూడెంట్స్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు. ఫుడ్ పాయిజన్‌పై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆరా తీశారు. వారికి సరైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఘటనపై ఆమె నివేదిక కోరారు.



