← Back to news

వైరస్‌లతో నాడీ వ్యాధులకు సంబంధం ఉందా?

By A.Ajay· 1d ago
వైరస్‌లతో నాడీ వ్యాధులకు సంబంధం ఉందా?

హైదరాబాద్‌లోని CSIR-CCMB సైంటిస్టులు ఫ్లూ, కొవిడ్‌-19 వంటి వైరస్‌లకు పార్కిన్సన్‌ వంటి నాడీ వ్యాధులకు మధ్య ఉన్న సంబంధంపై పరిశోధన చేశారు. వైరస్‌లలో ఉండే కొన్ని RNA నిర్మాణాలు ‘ఆల్ఫా-సిన్యూక్లిన్‌’ అనే ప్రొటీన్‌లో మార్పులకు కారణమయ్యే అవకాశం ఉందని గుర్తించారు. దీంతో మెదడులో అసాధారణ గడ్డలు ఏర్పడే ప్రక్రియ వేగం పెరగవచ్చని తెలిపారు. అయితే వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరికీ పార్కిన్సన్‌ వస్తుందని దీని అర్థం కాదని స్పష్టం చేశారు.

More in Health