అమెరికా, సింగపూర్‌లో KTR పెట్టుబడులు: రేవంత్

TG: సిరిసిల్ల సభలో CM రేవంత్‌రెడ్డి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకి విదేశాల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. అమెరికా, సింగపూర్‌లో KTR ఇన్వెస్ట్ చేశారని అన్నారు. హైటెక్ సిటీ చుట్టూ 3 దక్కన్ సెరాయ్ హోటళ్లు, ఎట్ హోమ్ సర్వీస్ అపార్ట్‌మెంట్లు KTR కుటుంబానికి చెందినవేనని ఆరోపించారు. ఈ ఆస్తులు 6 నెలల కిందటే వారి పేర్లకు మారాయని చెప్పారు. ఆస్తులపై వైట్ పేపర్ విడుదల చేయాలని KTRని కోరారు.




